అమరావతి: ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాలంటీర్ల సేవలకు బ్రేక్
★ మున్నిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
★ ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది.
★ దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
★ వరుస క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు.
★ ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో ఆయన పర్యటించారు..
★ తొలి పర్యటనలో ఆయన సంచలన నిర్ణయాలను ప్రకటించారు.
★ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల వినియోగం ఉండదని స్పష్టం చేశారు.
★ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తైన వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెడతామన్నారు.
★ ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయి.
★ విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరుండి అధికారపక్షానికి సహకరించారని.. ఫిర్యాదులు చేశాయి.
★ ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
★ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన పెట్టారు.
★ కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారాలు చూస్తే ఎక్కడా అధికారులు అలాంటి ఆంక్షలు పెట్టలేదు.
★ ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో 50కి పైగా అనుచరులు పాల్గొంటున్నారు.
★ కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేస్తే వారిపై కేసులు పెడతమంటున్నారు.
★ కోవిడ్ నిబంధనలు తప్పక అందరూ పాటించాల్సిందే అంటున్నారు.
★ కానీ ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదైనట్టు ఎక్కడా కనిపించడం లేదు.
★ ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
★ చెక్ పోస్టుల దగ్గర పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి అన్నారు.
★ పోలీస్టేషన్ కు వందకిలోమీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
★ అలాగే ఒత్తిడికిలోనై, భయబ్రాంతులకు గురై నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటున్నామని ముందుకు వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారికి ఎన్నికల కమిషనర్ తరపున కచ్చితంగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
★ అయినా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఎవరైనా ఆధారాలను చూపిస్తే పున పరిశీలిస్తామన్నారు.
★ ఈ సోమవారం వరకు అన్ని రాజకీయ పార్టీల నేతల ఫిర్యాదులను స్వీకరిస్తామని హామీ ఇచ్చారు.
★ పంచాయతీ ఎన్నికలు చక్కటి వాతావరణంలో జరిగాయని.
★ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పూర్తయ్యాయని.. ఆ ఎన్నికలతో అధికార యంత్రాంగం, వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడిందన్నారు.
★ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అందుకే 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయ్యింది అన్నారు.
★ రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని ఎస్ఈసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
★ భారీగా పోలింగ్ నమోదు కాావాలని ఆశిస్తున్నాను అన్నారు.