ఏలూరు, ఫిబ్రవరి 28, 2021. పత్రికా ప్రకటన
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విజయవాడ నుండి ఆదివారం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలని , ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ రమేష్ కుమార్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడలో పశ్చిమగోదావరి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్( రెవెన్యూ)శ్రీ కె వెంకట రమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్( డెవలప్మెంట్)శ్రీ హిమాన్సు శుక్లా పాల్గొని పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను, యాక్షన్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఏలూరు నుండి జాయింట్ కలెక్టర్ ( వెల్ఫేర్ )శ్రీ నంబూరి తేజ్ భరత్, డి ఆర్ ఓ శ్రీ ఎస్ శ్రీనివాస మూర్తి, ఆర్ డి ఓ లు ఏలూరు శ్రీమతి పనబాక రచన, కొవ్వూరు శ్రీ లక్ష్మారెడ్డి, జంగారెడ్డిగూడెం శ్రీమతి వైవి ప్రసన్న లక్మి, డి ఎస్ పి లు ఏలూరు శ్రీ ఓ దిలీప్ కిరణ్, కొవ్వూరు శ్రీ బి శ్రీకాంత్, నరసాపురం శ్రీ పి వీరాంజనేయ రెడ్డి, జంగారెడ్డిగూడెం శ్రీ బి రవి కిరణ్, డి ఎస్ పి ఎలక్షన్ సెల్ శ్రీ కె ప్రభాకర్, అడిషనల్ ఎస్ పి ( ఆడ్మిన్) శ్రీ ఏ వి సుబ్బరాజు, అడిషనల్ ఎస్ పి ఎస్ ఈ బి ఏలూరు శ్రీ సి జయరామ రాజు, ఎస్ డి పి ఓ పోలవరం శ్రీమతి కె లతా కుమారి, జిల్లా సహకార అధికారి శ్రీ ఎం వెంకట రమణ తదితరులు పాల్గొని వీక్షించారు.