కొనయమకుల లిఫ్ట్ ఇరిగేషన్ మరియు పంప్ హౌస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా
గీసుగొండ మండలం కొనయమకుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఈరోజు పరకాల ఎమ్మెల్యే గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా పంప్ హౌజ్ లోనుండి నీటిని లిఫ్ట్ చేసి మానిఫోల్డ్ గుండా నీటిని అండర్ గ్రౌండ్ పైపు ద్వారా 310 మీటర్ల దూరo ప్రవహింపచేసి అక్కడ డెలివరీ సిస్టర్న్ లోకి మళ్లించి, గ్రావిటీ మెయిన్ కెనాల్ లోకి నీటిని ఎత్తి పోయడం కోసం భూములు కోల్పోతున్న రైతులను ఒప్పించి ఈరోజు వారి సమస్యకు పరిష్కారం చూపించారు.
గత 2 సంవత్సరలుగా పరిష్కారం కానీ సమస్యను, కేవలం ఒక్కరోజులొనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే గారికి రైతులు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే 2 నెలల లోపు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగతిన పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులకు మరియు గుత్తేదారులకు ఆదేశించారు.
అలాగే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 14000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని ఎమ్మెల్యేగారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ అర్ ఎస్ పీ డీఈ రామకృష్ణ, గీసుగొండ మండల జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, కొనయమకుల సర్పంచ్ డొలే చిన్ని – రాధ భాయ్ మరియు అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.