గరికపాడు చెక్పోస్ట్ లో రెమిడిసివిర్ ఇంజక్షనలు స్వాధీనం
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట: గరికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి టి.యస్.ఆర్.టి.సి బస్సులో తరలిస్తున్న వంద రెమిడిసివిర్ ఇంజక్షనలు స్వాధీనం.
బహిరంగ మార్కెట్ లో 100 ఇంజక్షన్ ల విలువ 35 వేల రూపాయలు ఉందని బ్లాక్ మార్కెట్ ద్వారా 40 లక్షల వరకు ఉందని వెల్లడించిన వకుల్ జిందాల్.
వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
గరికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి టి.యస్.ఆర్.టి.సి బస్సులో తరలిస్తున్న వంద రెమిడిసివిర్ ఇంజక్షనలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హౌమ్ కి చెందిన డా॥ కరికపాటి సుబ్బారావు తో పాటు సిబ్బంది అజయ్ కుమార్ ని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ లోని లాండ్ మార్క్ హాస్పటల్ లో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్న డా॥ భవ్య ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది.
యడ్లపాడు గ్రామంలో నడుపుతున్న హాస్పిటల్ కి ఏటువంటి కోవిడ్ అనుమతులు లేవని వకుల్ జిందాల్ తెలిపారు.
డా॥భవ్య ని అదుపులోనికి తీసుకొని విచారణ చేయాల్సి ఉందన్నారు వకుల్ జిందాల్.
బహిరంగ మార్కెట్ లో 100 ఇంజక్షన్ ల విలువ 35 వేల రూపాయలు ఉందని బ్లాక్ మార్కెట్ ద్వారా 40 లక్షల వరకు ఉందని వకుల్ జిందాల్ వెల్లడించారు.