బ్రహ్మకుమారీస్ అధ్వర్యములో ఉగాది సంబరాలు కాలచక్రం పోస్టర్ ఆవిష్కరణ 7 రోజుల పాటు ఉచిత మెడిటేషన్ శిక్షణలు
విశాఖ సిటీ: ఉగాది పర్వదినాన తెలుగు నూతన సంవత్సరంలో పరమాత్ముని కృపతో ప్రపంచం శాంతి కలగాలని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రజాపిత బహ్మకుమారీస్ రామేశ్వరీ అన్నారు.
వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో సోమవారం కాలచక్ర పోస్టర్ను బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు వీజేఎఫ్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బహ్మకుమారీ రామేశ్వరీ మాట్లాడుతూ ముందుగా జర్నలిస్టులందరకీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచ మానవాళి అంతా ఈశ్వర కృప కోల్పోతున్నారు కనుకే సమస్యలు ఎదుర్కోంటున్నామన్నారు.
ఉగాది పర్వదినం పురస్కరించుకుని తమ సేవా కేంద్రాల్లో ఉచితంగా 7 రోజుల పాటు మెడిటేషన్ శిక్షణ ఇస్తామని తెలిపారు.
జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్సి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగువారికి ఉగాది ఒక ప్రత్యేక పండుగని, పండితులు, శాస్త్రజ్ఞులు సూచిస్తున్న కరోనా విలయతాండం నవంబర్ నెల వరకు కొనసాగుతుందని, ప్రజలు, పాత్రికేయులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ ఆయూరోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యదర్శి దుర్గారావు మాట్లాడుతూ ఇంగ్లీషు న్యూ ఇయర్ వేడుకలకు ఉన్న ఆశక్తి తెలుగు నామ సంవత్సర వేడుకలు గొప్ప తనం దిగజారిపోవడం
బాధకరమన్నారు.
కానీ ఇటువంటి తెలుగు కొత్త సంవత్సరం గొప్పతనాన్ని తెలయజేస్తున్న బ్రహ్మకుమారీస్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలు గుర్తుచేయడం అభినందనీయమన్నారు.
ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విశ్వశాంతి కోసం అందరూ బాగుండాలని ఆధ్యాత్మిక చింతనవైపు నడిపిస్తున్న బహ్మకుమారీస్ సంస్థ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బహ్మకుమారీ సత్యవతి, గురుజీ సుబ్బారావు, వీజేఎఫ్ సభ్యుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు.