మండపేట లో కరోనా కలకలం…
అధికారులు అప్రమత్తం…
మండపేట:- సరిగ్గా ఏడాది క్రితం మొదలై పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచి పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
మంగళవారం మండపేటలోని మూడు ప్రాంతాల్లో 7 కరోనా కేసులు నమోదయ్యాయి.
మండపేట పోలీస్ స్టేషన్ వీధిలో 2, ఆంధ్రా బాంక్ వీధిలో మరో రెండు, మున్సిపల్ కార్యాలయ వీధిలోని గౌరీ శంకర్ టైప్ ఇనిస్టిట్యూట్ వద్ద మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వాస్తవంగా ఇవి కొద్ది రోజులు క్రితమే నమోదైనప్పటికి అధికారులు గుర్తించేందుకు కాస్త ఆలస్యమైంది.
దీంతో మండపేట శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆయా చోట్ల ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు.
ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించి సిబ్బందిని ఏర్పాటు చేశారు.
జాగ్రత్తలు అవసరం…
ప్రతి ఒక్కరూ ఇకపై విధిగా మాస్కు ధరించకపోతే గతం తాలూకా చేదు జ్ఞాపకాలను మరోసారి ఎదుర్కోక తప్పదనే చెప్పుకోవాలి.
ఇటీవల కరోనా ప్రభావం సన్నగిల్లడంతో మాస్కు, సామాజిక దూరం, ఇతర జాగ్రత్తలను అందరూ విస్మరించారు.
అయితే ఇప్పుడు 7 కేసులు నమోదుకావడమంటే చిన్న విషయం కాదు. అధికారులు ప్రజలు వెంటనే మేల్కొని తగు జాగ్రత్తలు తీసుకుంటే విపత్తు నుండి తప్పించుకోవచ్చు.