స్నేక్‌డ్యాన్స్‌తో షేక్ చేద్దామనుకున్నాడు… పాపం ప్లాన్ బెడిసి కొట్టింది…
ఎవరైనా ముచ్చడ పడి ఏ కుందేలు పిల్లనో, కుక్కిపిల్లనో పెంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా కుక్కలను కుందేళ్ళను పెంచుకుంటే కిక్కేముంది అనుకున్నాడో ఏమో ఆ కుర్రాడు ఏకంగా పామునే పెంచుకుంటున్నాడు. పామంటే ఏదే బుట్టలోనో తట్టలోనో సర్దేసేంత చిన్న పామనుకునేరు, మనోడు ఏకంగా అనకొండానే పెంచేసుకుంటున్నాడండీ.
అవునండీ బాబూ ఇదీ నిజంగా నిజం. కావాలంటే మీరు చూడండి.
ఫోటోలో కనబడే ఆ కుర్రాడి పేరు కారుమంచి గంగాచలం. ఇతడి ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. ఇతగాడి మిత్రుడు భగవాన్ ఏకంగా కొండచిలువతోనే డ్యాన్స్ షో ఇవ్వాలనుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా ఓ కొండచిలవను పట్టి తెచ్చేసాడు. స్నేహితుడి కోసం ఇతగాడు ఆ కొండచిలువను తన ఇంటి బాత్రూంలో దాచిపెట్టాడు.
చూశారుగా ఎంతుందో ఈ కొండచిలువ, ఇంతకుముందే చెప్పినట్లు బుట్టల్లోనో తట్టల్లోనో కాదు ఇది గోతాముల్లో కూడా పట్టేలాలేదు, ఏకండా 11 అడుగులన్న ఈ పాము వయసు 8 నెలలు. బరవు 45 కిలోలు.
ఈ అనకొండాకి ఆకలి వేస్తే కోళ్ళు పిల్లులో కాదు, ఏకంగా గొర్రెలను మేకలను కూడా మింగేయగలదు. అంతా గప్‌చుప్‌గా బాగానే ఉంది కానీ పాపం ఎలా తెలిసిందే ఏమో గానీ కొండచిలువ ఉన్న సంగతి చుట్టు పక్కల వాళ్ళకు తెలిసిపోయింది. ఇంకేముంది కథ అడ్డం తిరిగింది, ఇళ్ళ మధ్యలో ఇంత పెద్ద పాము ఉండటం చూసి భయపడిపోయిన వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు, దానితో పోలీసులతో పాటు అటవీ శాఖా అధికారులు కూడా రంగంలోకి దిగి ఇళ్ళ మధ్యలో ఉన్న ఆ కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. ఇక అంతటితో చుట్టుపక్కల జనం ఊపిరి పీల్చుకున్నారు.