ఫోటోలో కనబడుతున్న యువతి పేరు ప్రీతి వయసు 15 సంవత్సరాలు, విజయవాడ వన్ టౌన్ లోని వించిపేటకు చెందిన ఈమె గత కొంత కాలంగా అరుదైన వ్యాధి బారిన పడి బాధ పడుతోంది.
ఈ వ్యాధి వల్ల కాలం గడుస్తున్న కొద్దీ రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతూ నరక యాతన అనుభవిస్తుంది.
నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఈమెకు తండ్రి లేకపోవడంతో తల్లి అక్కడక్కడా చేసే చిన్న చిన్న పనులతో వచ్చే చాలీ చాలని సంపాదనతోనే వైద్యం చేయిస్తున్నారు.
గడచిన రెండేళ్ళలో ఎన్ని హాస్పిటళ్శు తిరిగి ఎంత వ్యచ్ఛించినా ఫలితం మాత్రం కనబడలేదు.
ఇప్పటివరకు ప్రీతిని విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్, కానూరులోని నాగార్జున హాస్పిటల్, మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఇలా ఎన్ని చోట్ల ఎంత మందికి చూపినా వ్యాధి పూర్తిగా నయం కాలేదు.
అయితే ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవాలంటే ప్రీతి వైద్యానికి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె తల్లి ఏమి చేయాలో దిక్కు తోచక దయార్ధ హృదయులైన దాతల సహాయం కోసం ఎదురు చూస్తోంది.