వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్ శ్యామల
హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్-09న పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ క్రమంలో పలువురు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు షర్మిలను కలిసి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పలువురు నేతలు షర్మిలతో భేటీ అయ్యారు.
కాగా, తాజాగా టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల కూడా తన భర్తతో కలిసి షర్మిలను కలిశారు.
ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు తన భర్త నరసింహా రెడ్డితో కలిసి వెళ్లిన శ్యామల షర్మిలతో భేటీ అయ్యారు.
సుమారు పదిహేను నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించారు. పార్టీ పెడితే తాము కూడా తమ వంతు బాధ్యతలు నిర్వహించేందుక సిద్ధమేనా అనే విషయం స్పష్టమవ్వాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే.
ఫిబ్రవరి-10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పుట్టిన రోజు కావడంతో విషెస్ చెప్పడానికి శ్యామల దంపతులు లోటస్‌పాండ్‌కు వెళ్లి కలిశారు. తాజాగా వీరు మరోమారు షర్మిలతో భేటీ అయ్యారు.
ప్రస్తుతం శ్యామల యాంకర్‌గా, సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. నరసింహా పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు.