బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు 2021 మార్చి 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ సందర్శించనున్నారు.
మూడు అత్యంత చారిత్రాత్మక సంఘటనల సంస్మరణ ముఖ్య ఉద్దేశంతో ఈ సందర్శన చేపట్టనున్నారు ప్రధాని మోది.
బాంగ్లదేశే జాతిపితగా పిలువబడే ఆ దేశ మొట్టమొదటి అధ్యక్షుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాలైన ముజిబ్ బోర్షో లోపాల్గొనడం ఒక అంశం;
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావడం మరో అంశం;
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మరో చారిత్రాత్మక అంశం.
ప్రధాని చివరిసారిగా 2015 లో బంగ్లాదేశ్ సందర్శించారు.
ఈ పర్యటన సందర్భంగా మార్చి 26 న బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరవుతారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ షేక్ హసీనాతో మరియు, బంగ్లాదేశ్ అధ్యక్షుడు హిస్ ఎక్సలెన్స్ మహమ్మద్ అబ్దుల్ హమీద్ లతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరపనున్నారు.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ ప్రధానికి స్వాగతం పలుకనున్నారు.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన తరువాత బంగ్లాదేశ్ పర్యటన ప్రధాని మోదీ యొక్క మొట్టమొదటి విదేశీ పర్యటన కానుంది.
భారత్ బంగ్లాదేశ్‌కు ఇచ్చే ప్రాధాన్యతను ఈ పర్యటన చాటిచెప్పనుంది.