మావోయిస్టుల నుంచి నా భర్త విడుదలకు చర్యలు తీసుకోండి: జవాన్ భార్య
మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఏప్రిల్ 3వ తేదీన తన భర్తను మావోయిస్టులు బందీగా చేసుకున్నప్పటికీ, అతని విడుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
సెలవులు ముగిసిన తర్వాత ఒక రోజు ఆలస్యంగా విధులకు వెళ్తే అతనిపై చర్యలు తీసుకుంటారు, మరి ఇప్పుడు ఏమైందని మీనూ ప్రశ్నించారు.
తక్షణమే ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటించి తన భర్త విడుదలకు చర్యలు తీసుకోవాలని మీనూ కోరింది.