అవుకు ఎస్సై పై బదిలీ వేటు
కర్నూలు జిల్లా అవుకు ఎస్ ఐ పై తీవ్ర అవినీతి ఆరోపణలు. మండల కేంద్రం అవుకు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సదరు ఎస్సై పై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎస్ఐ గా విధులు చేపట్టిన నాటి నుండి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ అక్రమాలకు తెర తీశారు సదరు ఎస్సై రాజకీయ అండదండలతో మరింత రెచ్చిపోయేవారు.
అవుకు మండలంలో నాటుసారా తయారీదారుల నుండి పెద్ద మొత్తంలో లో డబ్బులు తీసుకుంటూ నాటు సారా తయారీ ప్రోత్సహించడమే కాక, పేకాట , గుట్కా, మట్కా ల వంటి అసాంఘిక కార్యకలాపాలను సైతం ప్రోత్సహిస్తూ పెద్ద మొత్తంలో వాటి నిర్వాహకుల నుండి నగదు వసూలు చేస్తున్నట్లు అ ఎస్సై పై ఆరోపణలు ఉండగా, పోలీస్ స్టేషనునే ప్రైవేటు పంచాయతీలకు అడ్డాగా మార్చి స్టేషనుకు వచ్చే బాధితుల నుండి అక్రమ వసూళ్లకు పాల్ప డ్డారు అంటూ ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి. దీంతో విసిగిపోయిన జిల్లా అధికారులు ఎట్టకేలకు ఎస్సై పై బదిలీ వేటు వేశారు.