భారత్ నుంచి రాకపోకలను నిషేధించిన న్యూజిలాండ్
వెల్లింగ్టన్: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను తమ దేశంలోకి రాకుండా నిలిపివేయాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నెల 11 నుంచి 28 వరకు భారత్ నుంచి న్యూజిలాండ్‌కు రాకపోకలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
భారత్ నుంచి వచ్చే సొంత పౌరులపై సైతం ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.