కువైట్‌లో చికుక్కున్న బాధితులను ఆదుకున్న MP రామ్మోహన్ నాయుడు గారు.
శ్రీకాకుళానికి చెందిన బాబు రావు సారా, గుంటూ పూర్ణచందన్ రావు, లోకనందం భీమా రావు అనే ముగ్గురు యువకులతో పాటు, వైజాగ్‌కు చెందిన నాగూర్ మీరా, మరియు మిగితా రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు యువకులు మర్చంట్ నేవీలో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి, ఆ దేశపు కోవిడ్ లొక్డౌన్ వల్ల దాదాపు 10 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు.
2020 నవంబర్ నెల నించి కువైట్‌లోని భారత రాయిబారి కార్యాలయానికి దరకాస్తులు అందిస్తూ, ఫోన్లు చేస్తూ వున్నా, ఆశించిన ఫలితం దొరక్క, వారి జిల్లా అయిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి బాధితులు తమను ఆదుకోమని 2021 ఫిబ్రవరిలో ఇమెయిల్ పంపారు.
MP గారు ఆ ఇమెయిల్‌కు వెంటనే స్పందించి, తిరిగి క్షేమంగా భారత దేశానికి రావడానికి బాధితులకు సహాయం చేయమని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారికి వెంటనే లేఖ రాశారు.
వారికి కువైట్‌లో వున్న భారతీయ రాయబార కార్యాలయం సహాయం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ లేఖను ట్విట్టర్ లో కూడా పెట్టారు.
అంతటితో వదిలేయకుండా, MP గారు ఈ యువకులతో వీడియో కాల్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు;
కువైట్‌లో ఉన్న తెలుగు సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి నరసింహ నాయుడు గారిని సంప్రదించి, అక్కడ చిక్కుకున్న వారి యోగక్షేమాల కనుక్కోని వారికి కావలసిన సహాయ సహకారాలు అందించమని కోరారు.
రామ్మోహన్ నాయుడు గారు కువైట్‌లోని భారత రాయిబారి కార్యాలయం అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించడం వలన, సంభందిత అధికారులు వీరిని భారత దేశానికి పంపించే ప్రక్రియను వేగవంతం చేసారు.
MP గారిని ఇమెయిల్ ద్వారా సంప్రదించి నెల రోజులు తిరక్కుండానే బాధితులు అందరు మార్చ్ 5వ తేదీన భారత దేశం చేరుకున్నారు.
స్వదేశానికి చేరుకున్న వెంటనే బాధితులు మాట్లాడుతూ, స్వదేశానికి తిరిగి వస్తామున్న నమ్మకం అప్పుడు లేదని, MP గారి చొరవ వలనే తాము క్షేమంగా తమ స్వగ్రామాలకు చేరుకున్నామని, జీవితాంతం MP గారు చేసిన సహాయం మరువమని కుటుంబ సభ్యులతో వచ్చి MP గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.