వేసవి కాలం లో గిరిజన గ్రామాల ప్రజలకు మంచి నీరు సరఫరా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ చేసారు.
శనివారం అరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీకి చెందిన హట్టగుడా గ్రామాన్ని యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య ప్రేమ్ కుమార్, మండల నాయకులు గుంజిడి సుబ్బారావులతో కలిసి సందర్శించారు.
మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామ మహిళలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
170 గడపలు, 600 పైన జనాభా గల ఈ గ్రామంలో చాలా కాలం నుండి మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొద్దిపాటి ఊట నీరు చాలా దూరంలో పొలాల మధ్య ఉందని, వర్షాకాలంలో మురికి నీళ్లుగా మారుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
మురికి నీరు త్రాగడం వల్ల విష జ్వరాలకు, ఇతర జబ్బులకు లోనవల్సివస్తోందని తెలిపారు.
కనీసం మంచినీరు కూడా కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.
ఉన్నతాధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించి వెంటనే మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గొల్లోరి పైడన్న, చలానా గౌరీ, గరం సుంక్ర, పడాల అప్పారావు, బి బుల్లమ్మ, పడాల కాంతమ్మ, పడాల శైలజ, తదితరులు పాల్గొన్నారు,