అనంతపురం: హిందూపురం లో జరగనున్న మునిసిపాలిటి ఎన్నికల సందర్భంగా గత రెండు రోజులుగా టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలసిందే.
అయితే ఈ సందర్భంగానే ఒకానొక సందర్భంలో బాలయ్య అభమానిపై దురుసుగా ప్రవర్తించారు.
వివరాల్లోకి వెళితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండ తీవ్రతకు కొద్దిగా సేదదీరేందకు స్థానిక నాయకుని ఇంటికి వెళ్లిన బాలయ్యను అక్కడి అభమానులు చుట్టుముట్టి ఫోటోలు విడియోల కోసం ఎగబడ్డారు.
వ్యక్తిగత విషయాలు చర్చించుకుంటున్న సందర్భంలో వీడియోలు తీయడంతో సహనం కోల్పోయిన బాలయ్య ఆవేశంతో ఒక అభిమాని చంపపై చేయి జేసుకున్నారు.
ఈ అంశం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు నాయకులు.
సదరు అభిమానితో ప్రత్యేకంగా ఒక వీడియో చిత్రీకరించి విడుదల చేశారు.
ఈ వీడియోలో సదరు అభమాని టిడిపి కండువా భుజాన వేసుకుని తాను బాలయ్య వీరాభిమానని, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎవరికీ కనీసం కరచాలనం కూడా చేయని బాలయ్య తన చెంపను తాకడం తాను అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు.