మంత్రి వెలంపల్లికి వేద అశీర్వచనం, తిరుమల తిరుపతి పంచాంగం అందించిన వేదపండితులు.
2021లో శ్రీ ప్లవనామ సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుని ప్రార్థించినట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
మంగళవారం బ్రాహ్మణవీధిలోని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి నివాసంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు వేదపండితులు అశీర్వచనం అందజేశారు.
ఉగాది సందర్భంగా డాలర్ శేషాద్రితో పాటు తిరుమల తిరుపతి వేదపండితులు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు తిరుమల తిరుపతి 2021 పంచాగం, స్వామి వారి ప్రసాదం, అశీస్సులను అందజేశారు.