విశాఖ: ఏసిబికి పట్టుబడ్డ జోన్ 8 (పాత జోన్ 6) ఈఈ యు.వి.వెంకటరావు..
ఈ సందర్భంగా ఏసిబి డిఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ, విరాట్ నగర్లో పూర్తిచేసిన 34 లక్షల కాలువ కాంట్రాక్టు పనులకోసం ఈఈ య.వి. వెంకటరావు ఒక శాతం లంచం డిమాండ్ చేశినట్లు తెలిపారు.
బిల్లులు పూర్తి చేసి ఫార్వార్డ్ చేయడానికి 34 వేలు డిమాండ్ అడుగగా, కాంట్రాక్టర్ రొంగలి అప్పలనాయుడు అతని భాగస్వామి ఏసిబి ని ఆశ్రయించినట్లు రమణమూర్తి ఈ సందర్భంగా తెలియజేసారు.
బాధితుని ఫిర్యాదు మేరకు ఈఈ వెంకటరావును ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఆయన తెలియజేసారు.
ఈ నెలకాఖరుతో ఈఈ పదవీ విరమణ చేయనున్నారు.