పురపోరు హోరాహోరి… మండపేటలో యుద్ధభేరి…
ముగిసిన ఉపసంహరణ..
72 విత్ డ్రా…
15 చోట్ల ముఖాముఖి..
14 వార్డుల్లో త్రిముఖ పోరు…
పది స్థానాల్లో జనసేన పోటీ… టిడిపి వైకాపాల మధ్యే ప్రధాన పోటీ…
మండపేట:- సంచలనాలకు మారుపేరు మండపేటలో ఈసారి పుర పోరు హోరాహోరీగా సాగనుంది. ఉపసంహణ పక్రియలో మొత్తం 72 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
దీంతో రంగంలో 76 మంది అభ్యర్థులు మిగిలారు. వీరు 30 వార్డుల్లో పోటీ పడనున్నారు. టిడిపి, వైస్సార్ సిపిలు 30 వార్డుల్లో పోటీకి దిగాయి.
జాతీయ పార్టీ బిజెపి కేవలం రెండు స్థానాల్లో పోటీకి పరిమితం కాగా స్వతంత్రులు నాలుగు చోట్ల పోటీలో ఉన్నారు. జనసేన 10 స్థానాల్లో పోటీ చేస్తోంది.
ప్రధానంగా టిడిపి, వైకాపాల మధ్యే యుద్ధభేరి కొనసాగనుంది. అత్యధికంగా 27వ వార్డులో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
15 స్థానాల్లో పోటీ నువ్వా నేనా అనే రీతిలో ద్విముఖ పోటీ నెలకొంది. ఈ 15 వార్డులలో టిడిపి వైకాపాలు ముఖాముఖి ఢీకొననున్నాయి.
ఇక్కడ ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నయి. ఇక 14 చోట్ల త్రిముఖపోటీ నెలకొంది.
కాగా ఈ ఎన్నికల్లో గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసిన వార ఏడుగురు ప్రస్తుత పోటీలో ఉన్నారు.
వీరిలో టిడిపి నుంచి చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గడి సత్యవతి, 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిరంగు జ్యోతి, 9 వార్డు టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న చుండ్రు వీర వెంకట సుబ్బారావు చౌదరి , ఆరో వార్డు అభ్యర్థి కాసినకాశివిశ్వనాధం, 26 వార్డు నుండి ఎరుబండి సత్యవతి లు గతంలో కూడా కౌన్సిలర్ లు గా పని చేశారు.
అలాగే 1, 29 వార్డులో వైకాపా నుంచి పోటీ చేస్తున్న పోతంశెట్టి ప్రసాద్, పిల్లి శ్రీనివాస్ లు తిరిగి అదే వార్డుల నుంచి బరిలో నిలిచారు.