అడవి జంతువుల వేట కోసం కరెంట్ వైర్ ఏర్పాటు.
వ్యక్తి చావుకు కారణం అయిన ఉచ్చు
కారకులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నెల 17వ తేదీ రాత్రి జజ్జరపల్లి గ్రామానికి చెందిన అర్కం రమేష్ మరియు తలాడి బాపు అనే ఇద్దరు వ్యక్తులు అడవి జంతువులను వేటాడేందుకు దాంపూర్ గ్రామ శివారులో గల కందుల ఎర్రయ్య పత్తి చేనులో బైండింగ్ వైర్ చుట్టి 11kv మెయిన్ లైన్ కు కనెక్షన్ ఇచ్చారు.
మేకల శంకర్ మరియు తoడి నారాయణ ఎల్లారం గ్రామ శివారు నుండి పంట చెఱకును ఎడ్లబండిపై తీసుకెళ్తుండగా రాత్రి సమయంలో దారి తప్పిపోయారు.
మార్గమధ్యంలో కందుల ఎర్రయ్య పత్తి చేను వద్ద ఎడ్ల బండి నిలిపి దారి గురించి వెతుకుతుండగా రమేష్ మరియు బాపులు ఏర్పాటు చేసిన కరెంటు వైరు తగలడంతో శంకర్ షాక్ కి గురయ్యారు.
మెకల శంకర్ కుడి మోకాలి కింద భాగoలో గాయాలు అయి అక్కడికక్కడే మృతిచెందాడు.
రమేష్ మరియు బాపులు తాము ఏర్పాటు చేసిన కరెంటు వైర్లవల్ల మనుషులకు ఇతర ప్రాణులకు ప్రమాదం అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా కరెంటు వైర్లు అమర్చి చివరకు శంకర్ మృతికి కారకులయ్యారు.
అంతేగాక మృతుడు అదే గ్రామానికి చెందిన మేకల శంకర్ కావడంతో చనిపోయిన విషయం తెలిసి భయపడి పారిపోయారు.
వారి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.