మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో వెలసియున్న శ్రీ దుర్గా రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మేళ తాళాలతో, విద్యుత్ కాంతులతో, వేదపండితుల ఆశీర్వచనాలతో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
మెట్ట ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన రాజపూడి గ్రామంలోని గత 21 సంవత్సరాల నుంచి శ్రీ దుర్గా రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామి దర్శనం కొరకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయం వద్ద విశేష పూజలు మరియు కుంభాభిషేకాలు శివరాత్రి పర్వదినం సందర్భంగా చేశారు.
ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున 25,000 మందికి అన్నదాన కార్యక్రమం మరియు 350-550 కడవలతో గ్రామంలోని ప్రజలు గ్రామం మొత్తం తిరిగి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జ్యోతుల చంటి బాబు గారు, మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, రాజపూడి గ్రామ నూతన సర్పంచ్ బూసాల విష్ణు మూర్తి గారు, బుసాల బాబురావు గారు, జగ్గంపేట సర్కిల్ CI B.సురేష్ గారు, జగ్గంపేట పోలీస్ స్టేషన్ SI T. రామకృష్ణ గారు, ఆలయ కమిటీ చైర్మన్ నల్లా వెంకన్న గారు, రాజపూడి కృష్ణాపురం సీతారాంపురం గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయడం జరిగింది..