సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై నమ్మకం లేక వలంటీర్లను..వారికి తోడుగా పోలీసులను రంగంలోకి దించిన తోడేరు బుడ్డారెడ్డి.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
ఎన్నికల ప్రచారం వలంటీర్లతో నిర్వహించడంపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు.
వలంటీర్ల ప్రచారానికే అభ్యంతరం చెబుతారా… అంటూ టీడీపీ కార్యకర్తలకు పోలీసుల వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీనికి వ్యతిరేకంగా ముత్తుకూరు పోలీసు స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు.
కోటంరెడ్డి నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఎస్సై అంజిరెడ్డి నీళ్లు నమిలుతున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తేలేదని హెచ్చరించారు.
ఓ పక్క ఇసుక, మరో పక్క మట్టి, ఇంకో పక్క బూడిద అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తూ, నాయకులపై నమ్మకం లేక సిగ్గు లేకుండా వలంటీర్లతో ప్రచారం చేయిస్తారా అంటూ కోటంరెడ్డి మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొచ్చినా, అక్రమ కేసులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
ఒకటిన్నర ఏడాదిలో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని, ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటామని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.