తిరుమల కళాశాలలో అంతకంతకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ కాతేరు వెంకట నగర్ పరిధిలో గల తిరుమల జూనియర్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది.
సుమారు 4000 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న ఈ కళాశాలలో 720మంది విద్యార్థిని విద్యార్థులకు కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా వారిలో 163మంది కి పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించి కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారి డి.ఎం.హె.చ్.వో. గౌరిశ్వరరావు ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడ కరోనా పరీక్షలు నిర్వహణకు చర్యలు చేపట్టామని, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు.
దీనిపై రూరల్ తహశీల్దార్, డివైఈవో దిలీఫ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల వసతులు సమకూర్చడం జరిగిందని, ఉదయం సాయంత్రం సమయంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పోన్ ద్వారా మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడం, ఎప్పటి కప్పుడు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.