గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన కాట్రపల్లి సర్పంచ్ పై చర్యలు తీసుకొవాలని కోరుతూ వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మహెందర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్ వార్డు సభ్యులు
-రీటైర్డు అయిన పిఆర్ ఎఈతొ తప్పుడు రికార్డు చెయించి ప్రస్తుతం వున్న పిఆర్ ఎఈతొ సంతకం
-అక్రమంగా గ్రామ పంచాయితి నిదులు దుర్వినియోగం
-స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో చెప్పినా ఫలితం మత్రం శూన్యం
-సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోని విథుల నుంచి తొలగించాలని డిమాండ్
వరంగల్ రూరల్ జిల్లా సంగెం, మార్చి06 : మండలంలోని కాట్రపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలొ మొరం పనులలో అవకతవకలు జరిగినట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
షుమారు రూ.3.5 లక్షల విలవ గల పనులు జరిపి ఏకంగా రూ.9.5 లక్షలకు బిల్లులు రికార్జు చేసినట్లు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమంలో విశ్రాంత ఏఈ తో తప్పుడు రికార్డు సృష్టించారని ఈ సందర్భంగా వారు వాపోతున్నారు.
ఈ విధంగా అక్రమంగా నిధులు దుర్వినియోగానికి పాల్పడిన కాట్రపల్లి సర్పంచ్ పులుగు సాగర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోని, విదుల నుంచి తొలగించాలని ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చొల్లెటి మాదవ రెడ్డి అద్వర్యములొ వార్డు సభ్యులు వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మహెందర్ కి వినతిపత్రం అందజేశారు.
అదె విధంగా కాట్రపల్లి గ్రామంలో విలేజ్ పార్క్ ప్రారంభోత్సవం చేయడానికి వచ్చిన పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అందరు కలిసి దరఖాస్తు ఇచ్చారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మరియు సంబందిత అధికారులు సర్పంచ్ పై చర్యలు తిసుకొని తమ గ్రామ ప్రజలకు న్యాయం చెయలని కొరుతున్నారు.
ఈ కర్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపిపి చొల్లెటి నర్మద-మాదవ రెడ్డి వార్డు సభ్యులు గాయపు రాజిరెడ్డి కుమార్ సునిత కవిత మాదవి నాయకులు కొమ్మలు యుగెందర్ రెడ్డి కమలాకర్ ఆశిర్వదాం తదితరులు పాల్గొన్నారు.