బ్రేకింగ్: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్
సర్పవరం గ్రామ పరిధిలో గల ఆటోనగర్ వద్ద టైకీ ఇండస్ట్రీస్ లో గ్యాసు లిక్..
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
ఇద్దరు మృతి పలువురు పరిస్థితి విషమం.
సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి కన్నబాబు
సర్పవరం గ్రామంలో గల టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీకైన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి…
బిల్డింగ్ పైన చుట్టుపక్కల ఉన్న గోడ పగిలి రోడ్డుపై చెల్లాచెదురవ్వడంతో కంపెనీలో పని చేస్తున్న 6 ఉద్యోగులకు గాయాల పాలయ్యారు…
క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కి తరలింపు
భయాంధోళనలో సర్పవరం, భావన్నారాయణప్పాడు గ్రామస్తులు..!
మృతుల వివరాలు
1) కాకర్ల సుబ్రహ్మణ్యం ( 31) తాల్లరేవు మండలం మల్లవరం గ్రామం
2) తోటకూర వెంకటరమణ ( 37) తాల్లరేవు మండలం పటవల గ్రామం.
గాయాలు అయిన క్షతగాత్రులు :
1) కుడుపూడి శ్రీనివాసరావు (సాంబమూర్తి నగర్) కాకినాడ.
2)నమ్మి సింహాద్రిరావు (గంగానాపల్లి గ్రామం) కాకినాడ రూరల్
3) కలగ సత్య సాయిబాబు సీరియస్ గా ఉంది. (గంగానాపల్లి గ్రామం) కాకినాడ రూరల్,
4) రేగిల్లి రాజ్ కుమార్ (కట్టమూరు గ్రామం) పెద్దాపురం
వీరంతా ఫ్యాక్టరీ లో ఆపరేటర్లు గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మాధవపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టైకీ ఇండస్ట్రీలో ఘటన పై మంత్రి కన్నబాబు సమగ్ర విచారణ కు ఆదేశించారు.