అన్న ప్రసాద కార్యక్రమానికి బియ్యం బస్తాలు అందజేసిన కొణతాల సీతారాం…
శ్రీరామ నవమి సందర్భంగా పలు ప్రాంతాల్లో రామలయాల వద్ద భక్తులకు అందజేసే అన్న ప్రసదా కార్యక్రమాల నిమిత్తం జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం బియ్యం బస్తాలను తనవంతు సహకరంగా అందజేశారు.
అందులో భాగంగా మంగళవారం ఎస్ ఆర్ బి కంపెనీలో 10 బియ్యం బస్తాలను మునగపాక మండలం అరబు పాలెం గ్రామానికి చెందిన రామాలయ కమిటీ సభ్యులకు జై అనకాపల్లి సేన నాయకుడు మామిడి చిన్నారావు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా రామాలయ దేవస్థానం అధ్యక్షుడు కోయిలాడ ఎర్రంనాయుడు మాట్లాడుతూ అన్న ప్రసాద కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో సహాయసహకారాలు అందించిన గౌరవనీయులు కొణతాల సీతారాం గారికి గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అరబు పాలెం రామాలయం కమిటీ ఉపాధ్యక్షుడు యల్లపు నాగేష్, డైరెక్టర్ కోయిలాడ చైతన్య, బొడ్డేడ జయరాం, జై అనకాపల్లి సేన నాయకులు షేక్ ఉమర్, రాజగిరి త్రిమూర్తులు, బొడ్డేడ మధు, దాడి బుజ్జి, దాడి పరదేసి నాయుడు, పెంటకోట కిషోర్, రోక్కం ప్రభు, భాను, జోడా దిలీప్ తదితరులు పాల్గొన్నారు.