మార్చి 5న విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయండి – SFI
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మార్చి 5న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ కార్యలయంలో పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం ఉదేశించి మాట్లాడుతూన ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కమిటీ సభ్యులు పి.వరహాల్ బాబు, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వర్గ సభ్యులు పి.చలపతి మాట్లాడుతూ…
32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలను బలోపేతం చేయకుండా ఉన్న ప్రభుత్వ రంగాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోందని వారు అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా విద్యార్థులను ఐక్యం చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5 న జరగనున్న రాష్ట్ర బంద్ కు ఎస్.ఎఫ్.ఐ, సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మార్చి 5న జరగనున్న బంద్ కి విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి బంద్ విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. నాయకులు పాపారావు, లోకేష్, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.