విశాఖపట్నం 92వ వార్డు వెంకటాపురంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి శ్రీను పై వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి బెహరా భాస్కరరావు దాడి చేశారంటూ స్థానిక నాయకులు నిరశన కార్యక్రమం చేపట్టారు.
ఓటమి భయంతోనే వైసిపి అభ్యర్ధులు ఈ దాడులకు పాల్పడినట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు.
జనసేన అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలతో పాటు అభ్యర్థి బెహరా భాస్కరరావు గారు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనుపై దాడికి పాల్పడినట్లు ఈ సందర్భంగా జన సైనికులు ఆరోపిస్తున్నారు.
దీనిపై వెంకటాపురం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఈ చర్యపై ఎలక్షన్ కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక నేతలు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు.