ఆనాడు వృద్ధాప్యంలో ఎన్టీఆర్ తప్పులు చేస్తున్నారని… తప్పనిపరిస్తితుల్లో పార్టీ వ్యవస్థాపకుడినే బలవంతంగా “నాయకత్వ మార్పు” అనే పేరుతో అధికారం నుండి తప్పించి పార్టీ వ్యవస్థను కాపాడారు.
ఈనాడు అదే వృద్దాప్య పరిస్థితుల్లో ఉన్న నాయకుడు, పుత్ర వాత్సల్యంతో ఎంత స్వీయ నగిషీ పెట్టినా సరే మెరుపు రావట్లేదు అని తెలిసినా అహంకార పెత్తనంతో చెప్పుకోలేని తప్పులు చేస్తూనే ఉన్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సామాజిక మాధ్యమాల్లోని సందేశాలు.
ప్రస్తుతం నెలకొన్న ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ ఒక “ఒయాసిస్”లా కనపడుతున్నాట్లు తెలుస్తుంది.
సొంత పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ తట్టుకోలేని, ఎవరికి చెప్పుకోలేని అవస్థలు పడిపోతుందని ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడాలంటే నాయకత్వ మార్పు తప్పనిసరని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు.
నిండా మునిగాక ఏమి చేయలేని పరిస్థితని, అందువల్ల ఈ పార్టీకి తక్షణమే నాయకత్వ మార్పు తేవాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందనే ఆలోచనలో ఆ పార్టీ వర్గాలు తమలో తాము సందేశాలు పంపుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.