అమరావతి: పట్టణ ప్రాంతంలో నివసిస్తూ ప్లాట్ కొనుక్కోవాలి అనుకున్న మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వమే స్థలం సేకరించి, అన్ని సదుపాయాలతో, అన్ని అనుమతులతో ఇప్పుడు మీరు నివాసముండే పట్టణానికి 5 కిలో మీటర్ల దూరంలో ప్లాట్లను విక్రయించనుంది.
★ ఈ లేఔట్లలో 150గజాలు, 200 గజాలు, 250 గజాలు వంటి 3 రకాల కొలతలు గల స్థలాలు (ప్లాట్స్) కేటాయించారు. ఈ లేఅవుట్ లో ఒక కుటుంబానికి 1 ప్లాట్ మాత్రమే కొనుగోలుకు అందరూ అర్హులే (ప్రభుత్వ ఉద్యోగులు కూడా).
★ ఆసక్తి ఉన్నవారు సచివాలయంలో ఏప్రిల్ 9 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
★ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ను బట్టి స్థలం సేకరించి, అన్ని సదుపాయాలు కల్పించి ధర నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఇంటి స్థలం ఉచితంగా మాత్రం కాదు. ప్రభుత్వం వారు, స్థానిక అధికారులు నిర్ణయించిన రేటు ప్రకారమే కొనుక్కోవాలి.
★ పేదలకు అందించే 90 రోజుల్లో ఇళ్ల స్థలాలకు దీనికి సంబంధం లేదు, దేని ప్రక్రియ దానిదే.
మీ క్లస్టర్లో ఆసక్తి కలవారికి దీనిపై అవగాహన కల్పించి, ఏవైనా సందేహాలు ఉంటే మీరు స్థానికంగా వుండే సచివాలయంలో సంప్రదించమని తెలియజేయండి.