ఈ రోజు తెల్లవారు ఝామున 2.30 నిమిషాలకు MPTC ZPTC ఎన్నికలపై డివిజన్ బెంచ్ తీర్పు
ఎంపీటీసి, జడ్పిటిసి ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బె౦చ్ మద్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్నికల కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ అప్పీల్ దాఖలు చేసింది.
మరి కొద్దిసేపటిలో వాదనలు వినిపి౦చనున్నట్లు వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు డి.వి.రామా౦జనేయులు తెలిపారు.
ఎన్నికల కమీషన్ ఇటీవల కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు, గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కోవిడ్ కారణంగా పరిషత్ ఎన్నికలు నిలిచిపోయి.
ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడనుంచే కొనసాగించరు ఇటీవల ఎన్నికల కమీషన్ చర్యలు చేపట్టింది.
అయితే ఎన్నికల నియమావళి (చట్టం) లో నాలుగు వారాలు ఎన్నికలకోడ్ నిబంధన పాటించాలని లేదని అయితే సుప్రీంకోర్టు సూచన పాటించలేదనే సాకుతో పరిషత్ ఎన్నికలు మరో 48 గ౦టల నిర్వహించడానికి సర్వసన్నద్ద౦ అయిన పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదావేయడ౦ సమంజసం కాదని, సింగిల్ బెంచ్ మద్యం తర ఉత్తర్వులు రద్దుచేయాలని ఎన్నికల కమీషన్, ప్రభుత్వం తరపున వాదనలు వినిపి౦చనున్నట్లు వైసిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రామా౦జనేయులు తెలిపారు.
పంచాయతి, మున్సిపల్ ఎన్నికల్లో ఘర పరాజయాన్ని జీర్ణించుకోలేక టిడిపి ఓటమి భయంతో పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి మరోవైపు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేయాలని హైకోర్టులో పిటీషన్ వేయడం ద్వారా వారి కుట్రపూరిత ద్వంద వైఖరి బట్టబయిలై౦దని వైసిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు డి.వి.రామా౦జనేయులు ఒక ప్రకటనలో విమర్శించారు.