హలో జర్నలిస్ట్… చలో హైదరాబాద్ .
- జర్నలిస్టుల సంక్షేమం కోసం అల్లం సర్ కృషి
- జర్నలిస్టుల సొంతింటి కల సాకారం చేయడమే లక్ధ్యం
- మార్చి 7న ప్రతినిధులు సభను జయప్రదం చేయండి
వరంగల్: జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే పని చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్ పేర్కోన్నారు.
శుక్రవారం హన్మకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల7న హైదరాబాద్ లో జరిగే టీయూడబ్ల్యూజే ప్రతినిధుల సభకు పెద్దఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఇండ్ల స్థలలతో పాటు ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో ఈ నెల 7న హైద్రాబాద్ జల విహార్ లో జర్నలిస్టుల ప్రతినిధుల మహాసభను నిర్వహిస్తున్నామన్నారు.
మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఫెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న 17.5 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లు కలిసి మంత్రి కేటీఆర్ తో చర్చించిన 24 గంటలు గడవకముందే పదిహేడున్నర కోట్లు మీడియా అకాడమీ ఖాతాలో జమ చేయించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇప్పటికే 34.5 కోట్ల రూపాయలను జర్నలిస్ట్ సంక్షేమ నిధికి తెలంగాణ ప్రభుత్వం అందజేసింది.
మరో 17.5 కోట్ల రూపాయలను గురువారం విడుదల చేయడంతో మొత్తం సంక్షేమ నిధి 52 కోట్ల కు చేరడం పట్ల మారుతిసాగర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఈ నిధితో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నోకార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, నిధి పెరుగుదలకు కృషి చేసిన అల్లం నారాయణకి, నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్ కి, ఇంత వేగంగా రావడానికి సహకరించిన జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగే జర్నలిస్ట్ ప్రతినిధుల మహాసభ కు మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, జర్నలిస్టులకు ఇల్లు లేదా ఇంటి స్థలాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా జర్నలిస్టులు తరలివచ్చి విజయవంతం చేయాలని మారుతిసాగర్ కోరారు.
ఈ కార్యక్రమంలో టెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ బీఆర్. లెనిన్, ఉమ్మడి వరంగల్ జిల్లా కో-కన్వీనర్ తడుక రాజనారాయణ, కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు నాయకులు పిన్నా శివకుమార్, మస్కపురి సుధాకర్, రాష్ట్ర నాయకులు మహేందర్, శివాజీ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సుభాష్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెండు రవీందర్, ఉమెందర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, కార్యదర్దులు అంతడుపుల శ్రీనివాస్, తిప్పిరిశెట్టి శ్రీనివాస్, టెంజు అర్బన్ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, రవీందర్, గట్టయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు…