బండి సంజయ్ పై బీజేపి అభ్యర్థి సంచలన ఆరోపణ
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు సహకరించకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో కుమ్మక్కు కావడం వల్లే ఫలితాల్లో బీజేపీ వెనుకబడింది అని నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారు.
ఈ మూడు జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్నదని, అనేకమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, టీచర్లు, లాయర్లు బీజేపీకి అండగా ఉన్నారని, అయినా ఓటింగ్ లో మాత్రం ఆ ఓట్లలో అధిక శాతం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని, దీని వెనుక ఒక సామాజిక కుట్ర దాగి ఉన్నదని ప్రేమేందర్ రెడ్డి కొందరితో నిన్న అన్న మాటలు బీజేపీలో కాక పుట్టిస్తున్నాయి.
కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని బండి సంజయ్ బలిపెట్టాడని, తన సామాజిక వర్గాన్ని పెంచి, ఇతర సామాజిక వర్గాలను తొక్కాలని బండి సంజయ్ చూస్తున్నారని అందుకే రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారని గుజ్జుల అభిప్రాయం.
పార్టీలో ఇంకో నాయకుడు ఎదగకూడదు అన్న బండి సంజయ్ వ్యూహం వల్లనే రెండు చోట్లా ఒడిపోతున్నాం అని ప్రేమేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.