జగ్గంపేటలో జల సంరక్షణే జన సంరక్షణ స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట
స్థానిక గోకవరం రోడ్డులోని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాలులో జల సంరక్షణే జన సంరక్షణ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జగ్గంపేట నియోజకవర్గం లోని 67 గ్రామ పంచాయతీల సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో జలవనరులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుందని వారం రోజుల పాటు జరిగే ఈ జల సంరక్షణే జన సంరక్షణ స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా మొదటి రెండు రోజులు గ్రామాల్లోనే ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రపరచుట తర్వాత రెండు రోజులు గ్రామాల్లోనే జంగిల్
క్లినింగ్ చేయుట తర్వాత రెండు రోజులు పరిసరాల పరిశుభ్రత పాటించుట తరువాత నీటిని పరీక్షించుట కోసం ప్రభుత్వం వారు ఇచ్చిన నీటి పరిరక్షణ కిట్లతో నీటి సాంద్రత తెలుసుకొనుట వంటి కార్యక్రమాలు చేసి జలసంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.
నియోజకవర్గంలోనే పంచాయతీ సర్పంచ్ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా నియోజకవర్గంలోని అందరూ సర్పంచులను ఆహ్వానించడం జరిగింది అని అందరిని సమానంగా చూసి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమ సుబ్బారావు, బండారు రాజా, ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, కుంచే రాజా దాసరి చిన్న బాబు, తోట రవి, భూపాలపట్నం ప్రసాద్, కందుల చిట్టి బాబు, తోట గాంధీ, జలవనరులశాఖ డీఇ, నాలుగు మండలాల యమ్.పి.డి.ఓ. లు, ఎమ్మార్వో లు, ప్రభుత్వ డాక్టర్లు, పాల్గొన్నారు.