గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఎన్నికల అప్డేట్స్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీస్, వాటర్ ట్యాంక్ 51 పోలింగ్ స్టేషనులో తన ఓటు హక్కును వినియోగించుకున్న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం. హరిత.
ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ లోని 49/14 పోలింగ్ స్టేషనులో తన ఓటు హక్కును వినియోగించుకున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్
సుబేదారి, కేయూసి, ఇంతేజార్ గంజ్, మట్వాడా, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, ఎ.సి.పిలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, ప్రతాప్ కుమార్ మరియు స్థానిక ఇన్స్పెక్టర్లతో కల్సి సందర్శించారు.
ఈ సందర్బంగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ పర్యవేక్షిండంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్బంగా పోలీంగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు శానిటైజర్లు, మాస్క్ లు, ఫేస్ షీల్డ్ వినియోగంపై పోలీస్ కమిషనర్ అరా తీసారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అరూరి….
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సాధారణ ఎన్నికలలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ 61వ డివిజన్ లోని ప్రశాంత్ నగర్ లోని తేజస్వి స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గ్రేటర్ వరంగల్ నగర ప్రజలు కరోనా ఉదృతిని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
34వ వార్డులో అధికార పార్టీ బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిగ్త పరిస్థితి
GWMC 34 వ డివిజన్ వందన హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద అధికార టీఆర్ఎస్ మరియు బిజెపి కార్యకర్తల మధ్య ఉద్రిగ్త పరిస్థితులు నెలకొన్నవి, బిజేపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో కాషాయ రంగు చొక్కాలు ధరించి ఉండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేశానికి లోనై, వారి కాషాయ చొక్కాలను తలగించారు.