గుంటూరు: కార్పోరేట్ కళాశాల నుండి విద్యార్థి అదృశ్యమైన ఘటన గుంటూరు జిలిలాలో చోటు చేసుకుంది.
ఘటన జరిగి 24 గంటలు గడిచిన యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్న తల్లిదండ్రులు.
కళాశాలకి వచ్చి తల్లి తండ్రులు అడిగేంత వరకు విద్యార్ధి అదృశ్యమైన విషయం గురించి యజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు.
దీంతో ఏం చేయాలో తోచని విద్యార్థి తల్లితండ్రుల కలాశాల వద్ద ఆందోళనకు దిగారు.
ఈ వషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నంచగా పొంతన లేని సమాధానం ఇస్తున్నారు.
సుమారు 800 మంది విద్యార్థులు ఉన్న క్యాంపస్ లో ఇలా ఇంటర్ చదువుతున్న విద్యార్థి మాయం అవడంతో ప్రస్తుతం మిగతా విద్యార్థుల తల్లిదండ్రులలో సైతం ఆందోళన మొదలైంది.
ఈ సంఘటనకు కేవలం యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అని స్పష్టమవుతుంది.
సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆటలకని బయటకు వెళ్ళిన విద్యార్థి వెనక్కి తిరిగి రాకపోయినా యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.
ఝటనకు సంబంధించి విచారించేదుకు తల్లిదండ్రులు ఎంత సేపు వేచి ఉన్నా ప్రిన్సిపాల్ రాలేదు. ఈ సంఘటనతో ప్రిన్సిపాల్ వైఖరిపై తల్లితండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.