క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మహిళలు షీ టీంకు ఫిర్యాదు చేయండి
-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేధింపులకు గురౌవుతున్న భాధిత మహిళలు తమ భద్రత కోసం ఇకపై క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయమని వరంగల్ పోలీస్ కమిషనర్ మహిళలకు పిలుపునిచ్చారు.
షీ టీం విభాగం రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ కంప్లయింట్ వాల్ పోస్టర్లను శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మహిళలు తమ భద్రత విషయంలో షీ టీంకు ఫిర్యాదు చేయడం మరింత సులభతరం చేయడం జరిగిందని తెలిపారు.
నూతనంగా రూపొందించబడిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ కంప్లయింట్ పోస్టర్ల ద్వారా మహిళలు మరింత సులభంగా ఫిర్యాదులు చేసేందుకుగాను ఈ కంప్లయింట్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్ళలతో పాటు ప్రధానంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, సినిమాథియేటర్స్, విధ్యాసంస్థలు వున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
బాధిత మహిళలు షీ టీం బృందాలకు ఫిర్యాదు చేయదలుచుకున్నడు తమ స్మార్ట్ ఫోన్లో షీ టీం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్ పై వున్న క్యూర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా https://qr.tspolice. gov. in అనే వెబ్ సైట్ అనుసంధానం అవుతుంది.
బాధితులు ఈ సైట్లోని ఫారంలో తమ పూర్తి వివరాలతో పాటు వారి ప్రస్తుత లోకేషన్ పూరించి ఆన్లైన్ లో సమర్పించాల్సి వుంటుంది.
కోడ్ స్కానింగ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు షీ టీం ఐటీ విభాగంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విధంగా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే సంబంధిత షీ టీం విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు తక్షణమే షీ టీం బృందాలు తగు సహయాన్ని అందజేస్తాయి.
ఆకతాయిల నుండి కాని మరే ఇతర వేధింపులకు గురౌవుతున్న మహిళలు గానీ షీ టీంకు ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమీషనర్ తరుణ్ జోషీ తెలియజేశారు.
ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా వుంచబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, వరంగల్ షీ టీం ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రావు, మహిళా కానిస్టేబుల్ మమత పాల్గొన్నారు.