భూపాలపల్లి నగర పంచాయతీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన గండ్ర
ఈ రోజు భూపాలపల్లిలోని కారల్ మార్క్స్ కాలనీలో ఈ నెల 14వ తేదీన జరుగు పట్టభద్రుల MLC ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు MLC ఎన్నికల ఇంచార్జి,పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ పుట్ట మధు గారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ పార్టీ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో – ఆప్షన్ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకులు, మహిళ నాయకులు, మైనారిటీ పార్టీ ప్రెసిడెంట్, జాగృతి జిల్లా యూత్ నాయకులు మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు
