విశాఖలో తల్లీబిడ్డ అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం…… సోంపేటకు చెందిన తల్లీబిడ్డ విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
సోంపేటకు చెందిన రవికుమార్ భార్య సరిత(34) కుమారుడు చేతన్(3) విశాఖలో రాజీవ్ గృరాలలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు.
కరోనా కారణంగా గత కొంత కాలంగా వీరు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజూ రవి ఉద్యోగ రిత్యా బయటకు వెళ్ళాడు.
రవికుమార్ ఇంట్లో లేని సమయంలో తల్లీబిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఈ విషయమై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేకుసుని దర్యాప్తు ప్రారంభించారు.
