ఆయుష్ కరోనా కంట్రోల్ సెల్ ప్రారంభం
శ్రీకాకుళం, ఏప్రిల్ 23 : శ్రీకాకుళం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో కరోనా కంట్రోల్ సెల్ ను ప్రారంభించడం జరిగిందని ఆయుష్ జిల్లా వైద్యాధికారి డా.కె. మాధవరావు చౌదరి తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాయలంలో ఉన్న ఆయుష్ ఆయుర్వేద ఆసుపత్రిలో కరోనా సెల్ ఏర్పాటు చేశామన్నారు.
ఈ సెల్ ద్వారా కరోనా వైరస్ కు సంబంధించిన ఆయుర్వేద, హోమియో, నేచురోపతి యోగ వైద్యవిధానం ద్వారా ప్రజలకు సలహాలు, సూచనలు అందించగలమని అన్నారు.
ఈ కంట్రోల్ సెల్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని చేతులు తరచు శుభ్రంగా కడుక్కొవాలని, తప్పనిసరిగా మాస్కును ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు కనీసం 6 అడుగులు దూరాన్ని పాటించాలని అన్నారు.
కంట్రోల్ సెల్ లో ఫోన్ ఏర్పాటు చేసామని సలహాలు, సూచనలకు 72075 05288 ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.