జాతీయ జండా రూపొందించి వంద సంవత్సరాలు పూర్తి అవతున్న నేపధ్యంలో ఈ రోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, జాతీయ జండా రూపకర్త అయిన శ్రీ పింగళి వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వేయస్ జగన్ మోహన్ రెడ్డి సత్కారించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అంతటి మహనీయుని కుమార్తెను సత్కరించడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఆంతేగాక పింగళి వెంకయ్య గారి జీవిత గాథను వారి త్యాగలను గుర్తిస్తూ వారికి అత్యుత్తమ భారతరత్న పురస్కారాన్ని అందించాలని కోరుతూ ప్రధానికి లేఖ వ్రాసినట్లు తెలిపారు.