దేశం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ముందుండే టాటాస్ ఆ కష్టాలకు ఎదురెళ్లి దేశాన్ని కాపాడేందుకు ముందు వరుస ఉంటారు.
కోవిడ్ మహమ్మారి విజృంభణతో నెలకొన్న ఆక్సిజన్ కొరతను గమనించిన టాటాస్ మరోసారి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
రోజుకు 300 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను వివిధ రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది టాటా స్టీల్.
ఈ సందర్భంగా కోవిడ్ మీద చేసే యుద్ధం లో మనం గెలుస్తాం అని ప్రధాని మోదీకి రతన్ టాటా సందేశం పంపారు.
ఈ విధంగా ప్రతీ భారతీయుడికి రతన్ టాటా ఒక ఆదర్శంగా నిలిచారు.