కొవిడ్ టీకా తీసుకున్న ఏపీ గవర్నర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మంగళవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వైద్య సిబ్బంది వారికి కొవిట్ టీకా వేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) ఎల్.శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్ఎం.ధ్యానచంద్ర పరిశీలించారు..
