బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల రెండు రోజులు సమ్మె …ఖాతాదారుల ఇక్కట్లు
భద్రాచలం:- బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రెండురోజుల సమ్మె చేపట్టారు.
దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె భద్రాచలం పట్టణంలో సోమవరం ప్రశాంతంగా కొన సాగింది.
పట్టణం లోని అన్నీ బ్యాంకులు మూతపడ్డయి. బ్యాంకుల సమ్మెకు వామపక్షాలు, ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి.
శనివారం రెండవది కావడం, మరసటి రోజు ఆదివారం, వరుసగా సోమ, మంగళవారం బ్యాంకుల సమ్మె కొనసాగుతుండడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ రద్దు చేయాలి:
బ్యాంకుల ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
స్థానిక చర్చి రోడ్ లోని SBI ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారని తెలిపారు.
ఆసరా పింఛన్లు, ముద్రలోన్స్, రైతుల రుణాలు, ఉద్యోగుల వ్యక్తిగత రుణాలకు ఆటంకాలు ఏర్పడతాయని తెలిపారు.
ప్రజలపై అధిక వడ్డీ భారం పడుతుందన్నారు. తక్షణమే ఆలోచనను ఫ్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, పవన్, మౌనిక, దివ్యలు పాల్గొన్నారు.