మీడియాపై ఫైరయిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
గుంటూరు జిల్లా వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారితో అసత్యాలను ప్రసారం చేయవద్దంటూ పాత్రికేయులకు తనదైన శైలిలో హెచ్చరించారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.
ఈ ప్రస్మీట్ లో జర్నలిస్టులు కొన్ని సమస్యలపై ప్రశ్నించిగా దానికి సదరు జర్నలిస్టుతో నీ చరిత్ర నాకు తెలుసని నీవు ఏమి చేశావో నాకు తెలుసునని ఆవేశంతో దుయ్యబట్టారు.
సదరు ఎమ్మెల్యో ఈ విధంగా ఘాటుగా విమర్శించడంతో ఖంగుతిన్న పాత్రికేయులు, ఇటువంటి ప్రవర్తన తమపట్ల అగౌరవంగా, అనుచితంగా ఉందని భావించి ఆ ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు.
విలేఖరుల పట్ల, అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
