అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో కీలక మలుపు
పేలుడు పదార్థాలున్న స్కార్పియో యజమాని ఆత్మహత్య
ముంబయి: దక్షిణ ముంబయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆ స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఠానే పోలీసులు వెల్లడించారు.
పేలుడు పదార్థాలున్న వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ మృతదేహం శుక్రవారం ముంబయికి సమీపంలోని ఓ వాగులో గుర్తించినట్లు తెలిపారు.
ఆయన ఓ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ స్కార్పియో ఎస్యూవీ వాహనాన్ని అంబానీ ఇంటికి సమీపంలో పోలీసులు గుర్తించారు.
ఆ వాహనం విక్రోలీలో నివసించే మన్సుఖ్ హిరెన్కు చెందిందని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.
ఆ వాహనంలో నీతా అంబానీకి రాసిన ఓ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ వాహనం అంతకుముందే చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.
కాగా ఈ వాహనాన్ని తామే ముకేశ్ అంబానీ నివాసం వద్ద ఉంచినట్లు జైష్- ఉల్- హింద్ సంస్థ ప్రకటించుకుంది.
కానీ ఈ ఘటనతో ఆ సంస్థకు సంబంధంలేదని పోలీసులు స్పష్టంచేశారు.