జిల్లా లో క్లిన్ స్వీప్ చేస్తాం…
ఇన్ చార్జ్ మంత్రి ధర్మాన..
మండపేట:- జిల్లాలో అన్ని మునిసిపాలిటీల్లో వైస్సార్ సిపి కైవసం చేసుకుంటుందని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు.
మండపేటలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ఇప్పటికే వైఎస్సార్సీపీ హవా చాటిందని ఇప్పుడు పురపాలక సంఘలలో అదే జోరు కొనసాగనుందని జోస్యం చెప్పారు.
జిల్లాలో అన్ని మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో విజయం తధ్యమని జోస్యం చెప్పారు.
మండపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న టీడీపీకి పంచాయతీల్లో షాక్ తగిలిందని… ఇక మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ కి ఓటమి తప్పదన్నారు.
రోజురోజుకు జగన్ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణర్జున చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, చైర్మన్ అభ్యర్థి పతి వాడ నుక దుర్గా రాణి, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు