మర్యాదపూర్వక కలయిక…
గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్పొరేషన్లు మరియు 75 మునిసిపాలిటీలు మరీ ముఖ్యంగా గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆఖండమైన మెజారిటీతో గెలిచిన సాధించారు.
ఈ సందర్భంగా నగరంలోని 20వ డివిజన్ కార్పొరేటర్ మరియు మేయర్ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మరియు పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి లేళ్ళ అప్పిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మరియు ఇతర పార్టీ పెద్దలు పాల్గొన్నారు.