రాజమహేంద్రవరంలో ట్పాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ డా. షీముషి బాజ్పాయ్ ఐ.పి.ఎస్. ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం ట్రాఫిక్ డిఎస్పి కె.వి.ఎన్.వర ప్రసాద్ అద్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ యాదవ్ మరియు ట్రాఫిక్ ఎస్.ఐ. లు, సిబ్బంది కలసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో అధిక శబ్దం కలిగించే వాహనాల సైలెన్సర్లను డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం Rs.1000/- లు జరిమానా విధిచడం జరిగినది.
ఈ స్పెషల్ డ్రైవ్ లో 50 వాహనాల యొక్క సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి వేసి వాటిని రోడ్ రోలర్ తో తోక్కించి ధ్వంసం చెయ్యడం జరిగినది.
అంతేగాక ఒక్కొక్క వాహనానికు రూ.1000/- లు చొప్పున మొత్తంగా రూ.50,000/- జరిమానా విధిచడం జరిగినది.
ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగించడం జరుగుతుందని, అంతేగాక అటువంటి సైలెన్సర్స్ విక్రయించే షాపుల వారిపైన మరియు సదరు సైలెన్సర్ బిగించే మెకానిక్ షాపుల వారిపైన కూడా తగుచర్యలు తీసుకోనబడునని ఈ సందర్భంగా తెలియచేసినారు.