ఆర్ బి కే చానల్ ను ప్రారంభించిన ముఖ్య మంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి
2020-21 రబీ ప్రొక్యూర్మెంట్ అంశంపై చర్చించేందుకు ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో సీయం జగన్ ఉన్నాతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భాగంగా 2021-22 ఖరీఫ్ సన్నద్ధతపై కూడా సీయం జగన్ అధికారులతో సమీక్షించారు.
రైతులకు అండగా నిలిచేందుకు నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరం వద్ద సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు రైతులకు సమాచారాన్ని చేరువ చేసేందు మరో ముందడుగు వేస్తూ సియం జగన్ ఈ రోజు ఆర్బీకే ఛానెల్ ను ప్రారంభించారు.